Friday, September 17, 2010

చక్ర పొంగలి

కావాల్సినవి:
బియ్యం - కిలో
పెసరపప్పు - పావు కిలో
జీడిపప్పు- పది
కిస్ మిస్- పది
యాలకులు-ఎనిమిది
నెయ్యి-ఒక కప్పు
బెల్లం- తగినంత
పచ్చికొబ్బరి చిప్ప- ఒకటి
ఉప్పు- చిటికెడు,పాలు-ఒక కప్పు
తయారు చేసే విధానం :
1)పెసరపప్పు, బియ్యం శుభ్రంగా కడిగి చిటికెడు ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి . సరిపడినంత బెల్లం తీసుకుని చిక్కగా పాకం పట్టి బాగా ఉడికిన బియ్యం ,పెసరప్పు మిశ్రమంలో పోసి బాగా కలపాలి.
2 ) పొయ్యి మీద భాణలి పెట్టి దానిలో నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ ,చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు అన్ని బాగా వేయించాలి.
3 ) తరువాత వీటిని పొంగలి లో వెయ్యాలి.యాలకులను పొడి కొట్టి పైన చల్లితే వేడి వేడి చక్ర పొంగలి రెడీ...

No comments:

Post a Comment