Venu Vantalu
Saturday, December 11, 2010
మటన్ పులావ్
కావాల్సినవి:
మటన్ - ఒక కిలో
పలావు బియ్యం- ఒక కిలో
ఉల్లిపాయలు- రెండు (పెద్దవి)
పచ్చిమిర్చి- ఇరవై
జీడిపప్పు - రెండు వందల గ్రాములు
నెయ్యి- ఆరు స్పూనులు
కొత్తిమీర - రెండు కట్టలు
లవంగాలు - పదహారు
యాలకులు- ఎనిమిది
వెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
దాల్చిన చెక్క - పది గ్రాములు
గసగసాలు - యాబై గ్రాములు
ధనియాలు - యాబై గ్రాములు
పలావు ఆకులు - పది గ్రాములు
మరాటీ మొగ్గ - పది గ్రాములు
కొబ్బరికాయ - ఒకటి
నిమ్మకాయలు - నాలుగు
పుదీనా - ఒక కట్ట
ఉప్పు - సరిపడా
పెరుగు - లీటరు
తయారీ విధానం :
1 ) పచ్చి మిర్చి, గసగసాలు, అల్లం, ధనియాలు వీటిని విడివిడిగా మెత్తగా నూరాలి, కొబ్బరి తురిమి పాలు తీసుకోవాలి, ఉల్లిపాయలను నిలువుగా తరిగిపెట్టుకోవాలి.
2 ) మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెరుగు, నాలుగు నిమ్మకాయల రసం , తగిన ఉప్పు, ముందుగా నూరిపెట్టుకున్న వాటిలో సగాన్ని, నూరిపెట్టుకున్న అల్లంవెల్లులిలో సగాన్ని వేసి బాగా కలిపి ఒక దళసరి గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి పోసి బాగా కాగిన తరువాత అందులో అన్ని కలిపిన మటన్ ను వేసి నీరు అంతా ఎగిరిపోయే దాక ఇగర బెట్టాలి.
3 ) ఇప్పడు మరొక పెద్ద బాణలి తీసుకుని అందులో నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
4 ) అందులోనే చెక్క, లవంగాలు, జీడిపప్పు, మరాటీ మొగ్గ, పలావు ఆకు, వేసి కాసేపు వేగనిచ్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంత సేపు వేగాక అందులో అరలీటరు కొబ్బరి పాలు, లీటరు నీళ్ళు కొలిచి పోసుకోవాలి.
5 ) ఇందులోనే పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా మరగనిచ్చి ఎసరు మరిగేటప్పుడు కడిగివుంచుకున్న బియ్యాన్ని కూడా వేయాలి.
6 ) అన్నం వుడుకుతుండగా ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ ను కూడా అందులో వేసి బాగా కలబెట్టి మూత పెట్టాలి.
7 ) తరువాత అది బాగా మగ్గాక పది నిమిషాలు వుంచి దింపేయాలి. దీనిలో పెరుగు చట్నీ గాని, కుర్మా గాని బాగుంటుంది.
Friday, September 17, 2010
చక్ర పొంగలి
కావాల్సినవి:
బియ్యం - కిలో
పెసరపప్పు - పావు కిలో
జీడిపప్పు- పది
కిస్ మిస్- పది
యాలకులు-ఎనిమిది
నెయ్యి-ఒక కప్పు
బెల్లం- తగినంత
పచ్చికొబ్బరి చిప్ప- ఒకటి
ఉప్పు- చిటికెడు,పాలు-ఒక కప్పు
తయారు చేసే విధానం :
1)పెసరపప్పు, బియ్యం శుభ్రంగా కడిగి చిటికెడు ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి . సరిపడినంత బెల్లం తీసుకుని చిక్కగా పాకం పట్టి బాగా ఉడికిన బియ్యం ,పెసరప్పు మిశ్రమంలో పోసి బాగా కలపాలి.
2 ) పొయ్యి మీద భాణలి పెట్టి దానిలో నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ ,చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు అన్ని బాగా వేయించాలి.
3 ) తరువాత వీటిని పొంగలి లో వెయ్యాలి.యాలకులను పొడి కొట్టి పైన చల్లితే వేడి వేడి చక్ర పొంగలి రెడీ...

కర్డ్ రైస్
కావాల్సినవి:
పాలు - రెండు లీటర్లు
బియ్యం -ముప్పావు కేజి
పచ్చి మిర్చి -నాలుగు
అల్లం - చిన్న ముక్క
కేరెట్ -ఒకటి
ఆవాలు- రెండు స్పూన్లు
జీలకర్ర-రెండు స్పూన్లు
సెనగ పప్పు- మూడు స్పూన్లు
మినపప్పు-రెండు స్పూన్లు
జీడి పప్పు - గ్రాములు
ఎండు మిర్చి-
కరివేపాకు -మూడు రెమ్మలు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - ఒక కట్ట
తయారు చేసే విధానం :
1) అన్నం మెత్తగా వండాలి. పాలు కూడా కాచి తోడు వేసి పెరుగు పులుపు రాకుండా రెడీ చేసుకోవాలి.
2) ఇప్పుడు వండుకున్న అన్నాన్ని బాగా చల్లారబెట్టాలి.ఇప్పుడు ఈ అన్నంలో అప్పుడే తోడుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి.
3) ఇప్పుడు ఈ పెరుగు అన్నంలో తగినంత ఉప్పు,చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు,సన్నగా తురిమిన కేరెట్ వేసి బాగా కలపాలి.
4) ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ముందుగా నూనె వేసి ,అది కాగిన తరువాత అందులో సెనగపప్పు,మినపప్పు,జీడిపప్పు వేసి అవి దోరగా వేగిన తరువాత జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి,చిన్నగా తరిగిన అల్లం ముక్కలు,చివరిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి.అవి బాగా వేగిన తరువాత దించి పక్కన పెట్టి చల్లార్చి చల్లారిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేయించి పెట్టుకున్న తాలింపును నూనె రాకుండా జాగ్రతగా వేయాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలా పెరుగు అన్నాన్ని బాగా కలపాలి.
5) ఇప్పుడు దాని తరిగిన కొత్తిమీర తో పైన అలంకరిస్తే కర్డ్ రైస్ రెడీ..దీన్ని కొంత సేపు ఫ్ర్రిజ్జ్ లో పెడితే చల్ల చల్లగా చాలా బావుంటుంది.

Saturday, May 16, 2009
అపోలో ఫిష్
కావాల్సినవి:
చందువా చేప - 500గ్రా
నిమ్మకాయ - సగం చెక్క
కొత్తిమీర - ఒక కట్ట
పెరుగు-ఒక కప్పు
గుడ్డు- ఒకటి
మైదా- 100గ్రా
కార్న్ ఫ్లోర్- 50గ్రా
ఉప్పు- తగినంత
మిరియాల పొడి- పావు టీ స్పూన్
రెడ్ ఆరెంజ్ కలర్ -చిటికెడు
కరివేపాకు-పది రెబ్బలు
పచ్చి మిర్చి- 25గ్రా
నూనె- వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) ముందుగా చందువా చేపను శుభ్రం చేసి ముళ్ళు లేకుండా రెండు అంగుళాల ముక్కలుగా కోసి ,వాటికి నిమ్మరసం ,ఉప్పు,మిరియాల పొడి కలిపి అర్ధ గంట పాటు నానబెట్టాలి.
2) తరువాత ఒక గిన్నెలో గుడ్డు పగులగొట్టి దానిలో మైదా,కార్న్ ఫ్లోర్ కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి చిటికెడు రెడ్ ఆరెంజ్ కలర్ కూడా కలపండి.
3) ఇప్పుడు నానబెట్టిన చేప ముక్కల్ని పిండిలో ముంచి,మరుగుతున్న నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టండి.
4) తరువాత ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె పోసి కాగాక అందులో నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు,కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసాక,పెరుగు వేసి వెంటనే ఫ్రై చేసిన చేప ముక్కల్ని కూడా వేసి పెరుగు ఇగిరే వరకు ఫ్రై చేసి,రైస్ తో వడ్డించండి.
చికెన్ సీక్ కబాబ్
కావాల్సినవి:
చికెన్ కీమా - 300గ్రా
అల్లం- 25గ్రా
పచ్చి మిర్చి- 25గ్రా
కొత్తి మీర- ఒక కట్ట
గరం మసాల- 2గ్రా
పెరుగు మీగడ-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడిగి,తరువాత దానిలో సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని,పచ్చిమిర్చి ముక్కల్ని ,కొత్తిమీర, గరం మసాల పొడి వేసి ,తగినంత ఉప్పు,పెరుగు మీగడ కలిపి ఉంచండి.
2) కొంచెం మందంగా ఉన్న ఇనుప చువ్వను తీసుకుని దానికి చుట్టూరా ఈ చికెన్ కీమా మిశ్రమాన్ని ఎనిమిది అంగుళాల పొడవునా చేతితో పట్టించండి.
3) ఇప్పుడు బొగ్గుల కుంపటి ఫై ,నిప్పులు ఎర్రగా తయారయ్యాక చికెన్ మిశ్రమం అంటించిన ఇనుప చువ్వలను నిప్పు సెగ చూపుతూ ,కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేవరకు వుంచండి.తరువాత చువ్వ నుండి కబాబ్ ను కిందికి లాగి,ప్లేట్ లో అమర్చి ,ఉల్లిపాయ ,నిమ్మ కాయ చక్రాలతో అలంకరిస్తే చికెన్ సీక్ కబాబ్ రెడీ.....
Tuesday, May 12, 2009
ఫ్రైడ్ మీట్ బాల్స్
కావాల్సినవి:
కీమా- 500గ్రా
మైదా- 150గ్రా
మిరియాల పొడి- 5గ్రా
ఈస్ట్- 5గ్రా
వెనిగర్- 5టీ స్పూన్లు
కారం- అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి- అర టీ స్పూన్
ఉప్పు- తగినంత
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) కీమాను శుభ్రం చేసి నీరు పిండివేయాలి .ఇందులో ఉప్పు,అల్లంవెల్లుల్లి ,కారం,కాస్త మిరియాల పొడి,వెనిగర్ కలిపి అరగంట సేపు నానా బెట్టండి.
2) ఒక గిన్నెలో మైదా,ఈస్ట్,ఉప్పు,మిగిలిన మిరియాలపొడి వేసి తగినన్ని నీళ్లు కలిపి బజ్జీల పిండిలా చేయండి.దీన్ని అరగంట సేపు పక్కన వుంచండి.
3) నానబెట్టిన కీమాను ఉండలుగా చేసుకుని వీటిన ముందు కలిపి వుంచుకున్న పిండిలో ముంచి-వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయండి.ఫ్రైడ్ మీట్ బాల్స్ రెడీ...
కోవా పూరి
కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార- ఒక కే జి
పచ్చి కోవా- 250 గ్రా
జాపత్రి-2 గ్రా
యాలకులు- 2గ్రా
సెనగ పిండి- 50 గ్రా
వంట సోడా- పావు టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూన్
నెయ్యి- 125 గ్రా
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) పచ్చి కోవాకు సెనగపిండిని కలిపి ఒక గిన్నె లో కొంచెం వేయించి దించి దానిలో జాపత్రిపొడి ,యాలకుల పొడి,కొంచెం చక్కెరకలిపి ముద్ద చేసి వుంచుకోవాలి. 2) ఒక బాణలి లో మిగిలిన చక్కెరను పోసాక-రెండు గ్లాసుల నీళ్ళు పోసి జిలేభి పాకంలా లేతగా వచ్చే వరకు ఉంచి దించి పక్కన పెట్టండి. 3 ) మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించండి. దానిలో - కరగబెట్టిన నెయ్యి కలిపి ,రెండు చేతులతోనూ పిండిని బాగా కలిపి తగినన్ని నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా తయారు చేసుకోండి.
4 ) తరువాత నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీలా కొంచెం మందంగా చేసుకొని ,మద్య లో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి ,అంచులను తడి చేసి,కోవాకు దగ్గరగా అంచులను చుట్టి కజ్జి కాయలా మడత పెట్టండి.
5) ఇప్పుడు వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి,చక్కెర పాకంలో వేసి ముంచి తీస్తే కోవా పూరి రెడీ....
Subscribe to:
Posts (Atom)