Saturday, January 31, 2009

చికెన్ లాలీపాప్

కావాల్సినవి:
చికెన్ రెక్కలు-ఎనిమిది
ఎండుమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-అర టీ స్పూన్
గరం మసాలా-చిటికెడు
కోడి గుడ్డు సొన- 2టీ స్పూన్లు
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉప్పు-తగినంత
నిమ్మరసం-ఒక టీ స్పూన్
ఆరెంజ్ కలర్ -చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం :
1)ముందుగా ఒక చికెన్ రెక్కను తీసుకుని దాన్ని వెనక్కి తిప్పి-జాయింట్ మద్య లో విరవండి.ఇలా చేయడం వల్ల,రెండు ఎముకల చివర్లు బయటకు వస్తాయి.వాటిలోనుండి సన్నటి ఎముకల్ని బయటకు లాగి తీసేయండి.చివరకు పెద్ద ఎముక మిగులుతుంది.దాన్ని పట్టి వున్న మాంసాన్ని ముద్దలా చేసి-ఎముక చివరకు చేర్చండి.ఇలా మిగిలిన చికెన్ రెక్కల్ని లాలీపాప్ ల మాదిరిగా సిదం చేసుకోండి.
2)ఈ ఎముకలను పట్టిన మాంసానికి పైన చెప్పిన మసాలాల్ని పట్టించి అరగంట సేపు ఉంచండి.
3)బాణలి లో మరుగుతున్న నూనె లో వీటిని ఎర్ర గా వేయించండి.తయారైన చికెన్ లాలిపాప్ లను అతిధులకు వేడి వేడి స్నాక్స్ గా అందించండి........

Friday, January 30, 2009

చీజ్ బాల్స్

కావాల్సినవి:
బంగాళా దుంపలు-పావు కేజి
నిమ్మకాయ-ఒకటి
మిరియాలపొడి-అర టీ స్పూన్
చీజ్- 150 గ్రా
మీగడ-50మీ.లీ
కోడిగుడ్డు-ఒకటి
బ్రెడ్ పొడి-అర కప్పు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 )బంగాళా దుంపల్ని మెత్తగా ఉడికించి మెదిపి ముద్దగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
2)ఈ ముద్దలో ఉప్పు,మిరియాల పొడి,నిమ్మ రసం కలిపి వుంచుకోవాలి.
3)చీజ్ ను తురిమి అందులో మీగడ కలిపి ఉండలు గా చేయాలి.
4)ఒక్కో ఉండకు బంగాళా దుంప మిశ్రమాన్ని అద్దుతూ గుండ్రని బంతుల్లా చేయాలి.
5)కోడిగుడ్డును పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి.ఇప్పుడు ఈ ఉండాలని సోనలో ముంచి బ్రెడ్ పొడి లో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.వేడి వేడి చీజ్ బాల్స్ రెడీ..ఇవి సాస్ తో తింటే బావుంటాయి....

వాక్కాయ కొబ్బరి పచ్చడి

కావలసినవి:
వాక్కాయలు- 100 గ్రా
పచ్చిమిర్చి-పది
వాలు-1 టీ స్పూన్
జీలకర్ర- 1టీ స్పూన్
పచ్చి కొబ్బరి-ఒకటి
నూనె-3 టీ స్పూన్లు
పసుపు-1/2టీ స్పూన్
మినపప్పు -1 టీ స్పూన్
సెనగ పప్పు- 1టీ స్పూన్
ఎండుమిర్చి-మూడు
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1)వాక్కాయలను చాకుతో కోసి మద్య లో గింజలను తీసేయండి.
2)తరువాత బాణలి లో ఒక చెంచా నూనె పోసి కాచాక ,అందులో కొంచెం ఆవాలు,జీలకర్ర వేసి ఫ్రై చేసాక అందులోనే పచ్చి మిరపకాయలు వేసి దించి,దానికి కొబ్బరి ముక్కలు,పసుపు,గింజలు తీసిన వాక్కాయలు,తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
3)ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడికి మిగిలిన ఆవాలు,జీలకర్ర,సెనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చిలతో తాలింపు ఇచ్చి బాగా కలియబెట్టి రైస్ తో వడ్డించండి.........

బగారా అండా కర్రీ

కావాల్సినవి:
గుడ్లు-నాలుగు
నువ్వులు-25 గ్రా
వేరుసెనగ పప్పు- 25 గ్రా
ధనియాల పొడి- 1టీ స్పూన్
కొబ్బరి-30 గ్రా
చింత పండు-30 గ్రా
కరివేపాకు- 4రెబ్బలు
కారం- 10గ్రా
ఆవాలు-చిటికెడు
ఎండుమిర్చి-మూడు
మెంతులు-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె- 60 గ్రా
తయారు చేసే విధానం:
1)గుడ్లను పావు గంట సేపు ఉడికించి,దించి పెంకు ఒలిచి చాకుతో గాట్లు పెట్టండి.
2)ఒక గిన్నెలో నూనె పోసి కాచాక -ఆవాలు,మెంతులు,ఎండుమిర్చి,కరివేపాకుతో తాలింపు పెట్టండి.
3 )ఆ తరువాత నువ్వులు,వేరుసెనగపప్పు,కొబ్బరి,వేయించి మెత్త గా నూరి మసాలా ముద్దను తయారు చేయండి.
4)ఇప్పుడు ఈ మసాలాను తాలింపు లో వేసి,కొంచెం సేపు వేయించండి.నూనె ఆ ముద్ద నుండి విడిపోతున్నప్పుడు కారం,పసుపు వేసి కలిపాక-చింత పండు పులుసు పోసి ఉడికించండి.తరువాత తగినంత ఉప్పు కలిపి గ్రేవీలా తయారయ్యాక ఉడకబెట్టిన గుడ్లను వేసి ,కాసేపు ఉడికిస్తే బగారా అండా కర్రీ రెడీ.... ఇది రైస్ తో వడ్డిస్తే బావుంటుంది......

Wednesday, January 28, 2009

మాంగో కా మీటా

కావాల్సినవి:
బ్రెడ్ పీసెస్ - 8
పంచదార- 300 గ్రా
మామిడి పండ్ల రసం-1 గ్లాస్
పాలు- 250 మీ.లీ
జీడిపప్పు- 20 గ్రా
పిస్తా పప్పు- 20 గ్రా
నెయ్యి -ఫ్రై చేయడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 )బ్రెడ్ ముక్కల అంచులు తీసేసి చిన్నచిన్న ముక్కలుగా చేయండి.
2 )తరువాత ఒక భానలిలో నెయ్యి వేసి కాచాక-బ్రెడ్ ముక్కల్ని వేయించి,పాలు పోసి సన్నని మంట మీద పెట్టి పాలు ఇంకి పోయేవరకు గరిట తో కలుపుతూ వుండాలి.
3 )తరువాత ఈ బ్రెడ్ మిశ్రమం మీద పంచదార,మామిడిపండ్ల రసం,ఒక కప్ నీళ్లు పోసి గరిటతో నెమ్మది కలపాలి.
4)పంచదార కరిగి బ్రెడ్ మిశ్రమంలో ఇంకి మరీ గుజ్జు గా కాకముందే దించేయండి.ఆ తరువాత జీడిపప్పు,పిస్తా పప్పు వేస్తె మాంగో కా మీటా రెడీ... దీని పైన చేర్రీస్ తో కూడా అలంకరిస్తే చాలా బావుంటుంది................

మాటర్ కోఫ్తా కర్రీ

కావలసినవి-
పచ్చి బఠానీ -పావు కేజి
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉల్లిపాయలు - 50 గ్రా
పచ్చి మిర్చి-నాలుగు
ఉప్పు-తగినంత
కారం-1 టీ స్పూన్
ధనియాల పొడి-1 టీ స్పూన్
గరం మసాలా- 1/4 టీ స్పూన్
పసుపు- 1/2 టీ స్పూన్
బంగాల దుంపలు-100 గ్రా
నూనె- 50 గ్రా
తయారుచేసే విధానం:
1)పచ్చి బఠానీలు ఉడికించి,మిక్సీలో గ్రైండ్ చేయండి.
2 )ఒక పాన్ లో నూనె వేసి కొన్ని ఉల్లిపాయముక్కల్ని వేయించండి.ఇందులో పచ్చిమిర్చి ముక్కలు,సెనగపిండి వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.ఆ పైన బఠానీ పేస్ట్ వేసి కలిపి ముద్దలుగా (కోఫ్తాలు) చేసి నూనెలో వేయించండి.
3 )ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించి,అందులో కారం,ధనియాల పొడి,పసుపు వేసాక-బంగాళా దుంప ముక్కలు కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించండి.గ్రేవి పూర్తిగా ఉడికాక,ఉప్పు వేయండి.ఇందులో ముందు గా వేయించి పెట్టుకున్న కోఫ్తాలు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు ఉడికిస్తే మాటర్ కోఫ్తా కర్రీ సిద్ధం......

Tuesday, January 27, 2009

బంజారా మటన్

కావాల్సినవి:
మటన్- 500 గ్రా
టమోటాలు- 150 గ్రా
ఉల్లిపాయలు-50 గ్రా
నూనె- 50 గ్రా
గరం మసాలా- 2గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లం-చిన్న ముక్క
ధనియాలు-2 టీ స్పూన్లు
ఎండుమిర్చి-మూడు
ఎండు మెంతి కూర-ఒక టీ స్పూన్
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 )మటన్ ని శుభ్రంగా కడిగి-గిన్నెలో వేసి కొంచెం ఉప్పు,గరం మసాలా కలిపి మెత్తగా ఉడికించాలి.
2)ఒక గిన్నె లో నూనె పోసి కాచాక -సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని ఎర్ర గా వేయించండి.తరువాత పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.తరువాత దంచిన ధనియాలు,ఎండుమిర్చి కలిపి ,ఉడికించిన మాంసాన్ని కూడా వేయండి.
3)ఈ మిశ్రమంలో టమోటా ముక్కల్ని వేసి సన్నని మంట మీద గ్రేవి పూర్తిగా ఉడికే వరకూ ఉంచి ఉప్పు సరి చూడండి.ఇప్పుడు దానిమీద ఎండు మెంతి కూర జల్లితే బంజారా మటన్ రెడీ.....