Thursday, March 5, 2009

పొంగలి పులావ్

కావాల్సినవి:
బాసుమతి బియ్యం- 500గ్రా
పెసరపప్పు- 200 గ్రా
నెయ్యి- 75 గ్రా
జీలకర్ర- 15 గ్రా
గరం మసాల- 5 గ్రా
పుదీనా- 2 కట్టలు
ఉల్లిపాయలు- 50 గ్రా
అల్లం-25 గ్రా
క్యారెట్- 100 గ్రా
బీన్స్- 100 గ్రా
బంగాళదుంపలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
పచ్చిమిర్చి- ఆరు
తయారు చేసే విధానం:
1) పెసరపప్పును రాళ్ళు లేకుండా శుభ్రం చేసి,బియ్యం తో కలిపి బాగా కడిగి నీళ్లు వడపోసి ఉంచండి.
2) తరువాత స్టవ్ మీదున్న గిన్నెలో నెయ్యి వేసి వేడిచేసాక జీలకర్ర,గరం మసాలాల్ని వేసి ఫ్రై చేయండి.తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేసాక,పచ్చిమిర్చి,చిన్నగా తరిగిన అల్లం ముక్కలు,పుదీనా,ముక్కలుగా తరిగిన కూరగాయలు వేసి ఇంకా ఫ్రై చేసి దానిలో వడగట్టిన బియ్యం,పెసరపప్పుల్ని కలిపి దోరగా వేయించండి.
3) ఇప్పుడు అదే గిన్నెలో ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి,తగినంత ఉప్పు కలిపి మూత పెట్టి మూడొంతులు ఉడికాక,పులావును గరిటెతో ఒక సారి బాగా కలియబెట్టి సన్నటి మంట మీద పూర్తిగా ఉడికేవరకు ఉంచి,దించి, గ్రేవీతో వడ్డిస్తే బావుంటుంది.

No comments:

Post a Comment