Tuesday, February 24, 2009

ఆలు బైగన్ కర్రీ

కావాల్సినవి:
వంకాయలు- 250 గ్రా
బంగాళా దుంపలు- 250 గ్రా
ఉల్లిపాయలు-60 గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
కారం-ఒకటిన్నర టీ స్పూన్
జీలకర్ర పొడి-పావు టీ స్పూన్
ధనియాల పొడి-అర టీ స్పూన్
పసుపు-చిటికెడు
టమోటాలు-నాలుగు
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా

తయారు చేసే విధానం:
1) తెల్ల వంకాయలు,బంగాల దుంపలను ముక్కలు గా తరిగి ఉప్పు నీటిలో వేయండి.
2 ) ఒక గిన్నెలో నూనె పోసి కాచాక-సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని సన్నటి సెగమీద వేయించండి.ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద ,కారం,ధనియాలు,జీలకర్ర పొడి తో పాటు పసుపు వేసి కాయగూరముక్కల్ని కూడా కలిపి వేయించండి.ముక్కల్లో నీరు ఇంకిపోతే గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించండి.
3) కూర ఉడికిన తరువాత టమోటాలని ,తరిగిన కొత్తిమీర వేసి కాసేపు ఉడికించి తరువాత దించాలి.దీనిని రైస్ తో వడ్డిస్తే బావుంటుంది.

అటుకుల దోశ

కావాల్సినవి:
బియ్యం-2 కప్పులు
అటుకులు- అర కప్పు
చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు
మెంతులు-ఒక టీ స్పూన్
వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్
నూనె -తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంచేసుకోవాలి.తులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ... ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ పప్పుచట్నీ తో కూడా బావుంటాయి.

Monday, February 23, 2009

చాంద్ బిస్కట్స్

కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార పొడి-పావు కేజి
యాలకులు- 3గ్రాAdd Video
వనస్పతి -పావు కేజీ
తయారు చేసే విధానం:
1) మైదాను జల్లించండి.మద్యలో గొయ్యిలా చేసి ,వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యేవరకు ఉంచండి.పిదప పంచదార పొడి చేర్చండి.ఇందులో కొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయండి.
2 )మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దన చేసి పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారు అవుతుంది.పైన యాలకుల పొడి కలపండి.
3 ) ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్నా చపాతీలా చేయండి. పదును ఉన్నా గ్లాస్ తో ఆ చపాతి గట్టిగా అద్దితే బిస్కట్లు రూపొందుతాయి.వీటిని ఒక ట్రేలో అమర్చి నూట ఎనభయి డిగ్రీల దగ్గర ఇరవయ్ నిమిషాలు బెక్ చేయండి .చాంద్ బిస్కట్స్ రెడీ....చల్లారిన తరువాత ఆరగించండి.

Friday, February 20, 2009

సమోసా చికెన్ కర్రీ

కావాల్సినవి:
చికెన్ బ్రెస్ట్ పీస్లు -రెండు
పనీర్-50 గ్రా
జీడిపప్పు- 20 గ్రా
కొత్తిమీర-ఒక కట్ట
పచ్చి మిర్చి-మూడు
నిమ్మకాయ-ఒకటి
నూనె-వేయించడానికి సరిపడా
గ్రేవీ తయారీకి:
గసగసాలు- 25 గ్రా
జీడిపప్పు- 25 గ్రా
కారం-ఒకటిన్న టీ స్పూన్
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు- 50 గ్రా
పెరుగు- 100 గ్రా
గరం మసాల- 1గ్రా
పచ్చి మిర్చి-రెండు
టమోటాలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా
పసుపు-చిటికెడు
తయారు చేసే విధానం:
1 )ముందుగా ఒక బాణలిలో కొంచెం నూనె పోసి కాచాక -సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించండి.తరువాత అందులో అల్లంవెల్లుల్లి ముద్ద,కారంపసుపు,రుబ్బిన మసాలముద్దను చేర్చి వేయించండి.ఆ తరువాత దానిలో పెరుగు,టమోటాముక్కలు ,పచ్చిమిర్చి వేసి మరిగిస్తే గ్రేవీ రెడీ అవుతుంది.
2)తురిమిన పనీర్ లో జీడిపప్పు,కొత్తిమీర,పచ్చి మిర్చి ,నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి.
3 )చికెన్ బ్రెస్ట్ పీస్లను ఆకు ఆకారం లో రెక్క జాయింట్ దగ్గర కోసి చేతితో లాగితే ఎముక మిగిలి చర్మం విడిపోతుంది.
4)ఈ చర్మంలో -పైన తయారు చేసిన మిశ్రమాన్ని కూరి ,సమోసా ఆకారంలో చికెన్ పీస్ ను మదచండి.చివరలు విడిపోకుండా దారం తో కట్టి-వాటిని బాణలిలో మరుగుతున్న నూనె లో వేయించి తీయండి.
5)ఇలా తయారైన సమోసాలను పైన సిద్ధం చేసిన గ్రేవీలో వేసి,పైన కొత్తిమీర జల్లి అతిధులకు అందించండి.

Thursday, February 12, 2009

పాలకూర పకోడీ

కావాల్సినవి:
పాలకూర-పది కట్టలు
సెనగపిండి-200 గ్రా
కారం పొడి-ఒక టీ స్పూన్
వంట సోడా-పావు టీ స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
పసుపు-చిటికెడు

తయారు చేసే విధానం:

1)ముందు గా పాలకూర కాడలను తుంచాలి.ఆ తరువాత కట్టలను విడదీసి నీళ్ళలో బాగా కడిగి సన్నగా తరిగి ఉంచండి .
2 )ఇప్పుడు సెనగపిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నె లో జల్లించి దానికి తగినంత ఉప్పు,కారం,పసుపు,వంటసోడా కలిపి,నీళ్ళతో జారుడుగా బజ్జీల పిండిలా కలపండి.ఆ తరువాత తరిగి వుంచిన పాలకూరను కలిపి బాణలిలో ఎర్రగా వేయించి,ప్లేట్లలో అమర్చి అతిధులకు అందించండి.





Monday, February 2, 2009

వెజ్ నేచురల్

కావలసినవి :
కేరేట్స్- 100గ్రా
బీన్సు- 100 గ్రా
ఆనపకాయ-ఒక ముక్క
టమోటాలు-రెండు
ఆవాలు- పావు టీ స్పూన్
జీలకర్ర-పావు టీ స్పూన్
పచ్చి మిర్చి-ఆరు
పసుపు-పావు టీ స్పూన్
గోధుమపిండి-3 టీ స్పూన్లు
కొత్తిమీర-ఒక కట్ట
నూనె-2 టీ స్పూన్లు
ఉప్పు- తగినంత
కరివేపాకు-కొంచెం
తయారు చేసే విధానం:
1)కూరగాయలన్నీ ముక్కలు గా కోసి ఉంచుకోవాలి.
2 )ఒక గిన్నెలో నూనె పోసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకుతో తాలింపు ఇవ్వండి.అందులో పచ్చిమిర్చి, గోధుమ పిండి,పసుపు చేర్చి కొద్ది సేపు వేయించాలి.
3)ఆ పైన కాయగూరముక్కలు (టమోటా ముక్కలు తప్ప),ఒకటిన్న గ్లాసులనీళ్లు పోసి సన్నటి మంట మీద ఉడికించండి.అవి కొంచెం ఉడికాక టమోటా ముక్కలు వేసి అవి కొంచెం మగ్గాక ,ఉప్పు ,కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాల తరువాత దించండి.అంతే వెజ్ నేచురల్ రెడీ...

Sunday, February 1, 2009

రవ్వ కజ్జికాయలు

కావాల్సినవి:
మైదా పిండి-అర కేజీ
నెయ్యి- 50 గ్రా
ఉప్పు-చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
పూర్ణం కోసం
నెయ్యి - 50 గ్రాb
బొంబాయి రవ్వ- 300 గ్రా
పంచదార- 400 గ్రా
కొబ్బరి తురుము- 100 గ్రా
యాలకులు- 5గ్రా
తయారు చేసే విధానం:
1) బొంబాయి రవ్వ,నెయ్యి కలిపి దొర గా వేయించి,అందులో పంచదార పొడి,వేయించిన కొబ్బరి తురుము,యాలకుల పొడి కలిపి పక్కన వుంచండి.
2)మైదాను జల్లించి -ఉప్పు,నెయ్యి కలపండి.దీన్ని నీళ్ళతో తడిపి గట్టి ముద్దలా చేసి పది నిమిషాలు సేపు వస్త్రాన్ని కప్పండి.తరువాత చిన్న చిన్న ఉండలు గా చేసి పూరీలు వత్తండి.దీని మద్య లో రెండు చెంచాల పూర్ణం మిశ్రమాన్ని ఉంచి రెండు అంచులూ దగ్గరకు చేర్చి గోరంచుగా మడత పెట్టండి.ఇలా చేసిన వాటిని నూనె లో దొరగా వేయిస్తే రవ్వ కజ్జికాయలు సిద్ధం...