బియ్యం-2 కప్పులు
అటుకులు- అర కప్పు
చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు
మెంతులు-ఒక టీ స్పూన్
వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్
నూనె -తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంచేసుకోవాలి.తులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి ఆ పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ... ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ పప్పుచట్నీ తో కూడా బావుంటాయి.
No comments:
Post a Comment