Saturday, January 31, 2009

చికెన్ లాలీపాప్

కావాల్సినవి:
చికెన్ రెక్కలు-ఎనిమిది
ఎండుమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-అర టీ స్పూన్
గరం మసాలా-చిటికెడు
కోడి గుడ్డు సొన- 2టీ స్పూన్లు
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉప్పు-తగినంత
నిమ్మరసం-ఒక టీ స్పూన్
ఆరెంజ్ కలర్ -చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం :
1)ముందుగా ఒక చికెన్ రెక్కను తీసుకుని దాన్ని వెనక్కి తిప్పి-జాయింట్ మద్య లో విరవండి.ఇలా చేయడం వల్ల,రెండు ఎముకల చివర్లు బయటకు వస్తాయి.వాటిలోనుండి సన్నటి ఎముకల్ని బయటకు లాగి తీసేయండి.చివరకు పెద్ద ఎముక మిగులుతుంది.దాన్ని పట్టి వున్న మాంసాన్ని ముద్దలా చేసి-ఎముక చివరకు చేర్చండి.ఇలా మిగిలిన చికెన్ రెక్కల్ని లాలీపాప్ ల మాదిరిగా సిదం చేసుకోండి.
2)ఈ ఎముకలను పట్టిన మాంసానికి పైన చెప్పిన మసాలాల్ని పట్టించి అరగంట సేపు ఉంచండి.
3)బాణలి లో మరుగుతున్న నూనె లో వీటిని ఎర్ర గా వేయించండి.తయారైన చికెన్ లాలిపాప్ లను అతిధులకు వేడి వేడి స్నాక్స్ గా అందించండి........

Friday, January 30, 2009

చీజ్ బాల్స్

కావాల్సినవి:
బంగాళా దుంపలు-పావు కేజి
నిమ్మకాయ-ఒకటి
మిరియాలపొడి-అర టీ స్పూన్
చీజ్- 150 గ్రా
మీగడ-50మీ.లీ
కోడిగుడ్డు-ఒకటి
బ్రెడ్ పొడి-అర కప్పు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 )బంగాళా దుంపల్ని మెత్తగా ఉడికించి మెదిపి ముద్దగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
2)ఈ ముద్దలో ఉప్పు,మిరియాల పొడి,నిమ్మ రసం కలిపి వుంచుకోవాలి.
3)చీజ్ ను తురిమి అందులో మీగడ కలిపి ఉండలు గా చేయాలి.
4)ఒక్కో ఉండకు బంగాళా దుంప మిశ్రమాన్ని అద్దుతూ గుండ్రని బంతుల్లా చేయాలి.
5)కోడిగుడ్డును పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి.ఇప్పుడు ఈ ఉండాలని సోనలో ముంచి బ్రెడ్ పొడి లో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.వేడి వేడి చీజ్ బాల్స్ రెడీ..ఇవి సాస్ తో తింటే బావుంటాయి....

వాక్కాయ కొబ్బరి పచ్చడి

కావలసినవి:
వాక్కాయలు- 100 గ్రా
పచ్చిమిర్చి-పది
వాలు-1 టీ స్పూన్
జీలకర్ర- 1టీ స్పూన్
పచ్చి కొబ్బరి-ఒకటి
నూనె-3 టీ స్పూన్లు
పసుపు-1/2టీ స్పూన్
మినపప్పు -1 టీ స్పూన్
సెనగ పప్పు- 1టీ స్పూన్
ఎండుమిర్చి-మూడు
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1)వాక్కాయలను చాకుతో కోసి మద్య లో గింజలను తీసేయండి.
2)తరువాత బాణలి లో ఒక చెంచా నూనె పోసి కాచాక ,అందులో కొంచెం ఆవాలు,జీలకర్ర వేసి ఫ్రై చేసాక అందులోనే పచ్చి మిరపకాయలు వేసి దించి,దానికి కొబ్బరి ముక్కలు,పసుపు,గింజలు తీసిన వాక్కాయలు,తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
3)ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడికి మిగిలిన ఆవాలు,జీలకర్ర,సెనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చిలతో తాలింపు ఇచ్చి బాగా కలియబెట్టి రైస్ తో వడ్డించండి.........

బగారా అండా కర్రీ

కావాల్సినవి:
గుడ్లు-నాలుగు
నువ్వులు-25 గ్రా
వేరుసెనగ పప్పు- 25 గ్రా
ధనియాల పొడి- 1టీ స్పూన్
కొబ్బరి-30 గ్రా
చింత పండు-30 గ్రా
కరివేపాకు- 4రెబ్బలు
కారం- 10గ్రా
ఆవాలు-చిటికెడు
ఎండుమిర్చి-మూడు
మెంతులు-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె- 60 గ్రా
తయారు చేసే విధానం:
1)గుడ్లను పావు గంట సేపు ఉడికించి,దించి పెంకు ఒలిచి చాకుతో గాట్లు పెట్టండి.
2)ఒక గిన్నెలో నూనె పోసి కాచాక -ఆవాలు,మెంతులు,ఎండుమిర్చి,కరివేపాకుతో తాలింపు పెట్టండి.
3 )ఆ తరువాత నువ్వులు,వేరుసెనగపప్పు,కొబ్బరి,వేయించి మెత్త గా నూరి మసాలా ముద్దను తయారు చేయండి.
4)ఇప్పుడు ఈ మసాలాను తాలింపు లో వేసి,కొంచెం సేపు వేయించండి.నూనె ఆ ముద్ద నుండి విడిపోతున్నప్పుడు కారం,పసుపు వేసి కలిపాక-చింత పండు పులుసు పోసి ఉడికించండి.తరువాత తగినంత ఉప్పు కలిపి గ్రేవీలా తయారయ్యాక ఉడకబెట్టిన గుడ్లను వేసి ,కాసేపు ఉడికిస్తే బగారా అండా కర్రీ రెడీ.... ఇది రైస్ తో వడ్డిస్తే బావుంటుంది......

Wednesday, January 28, 2009

మాంగో కా మీటా

కావాల్సినవి:
బ్రెడ్ పీసెస్ - 8
పంచదార- 300 గ్రా
మామిడి పండ్ల రసం-1 గ్లాస్
పాలు- 250 మీ.లీ
జీడిపప్పు- 20 గ్రా
పిస్తా పప్పు- 20 గ్రా
నెయ్యి -ఫ్రై చేయడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 )బ్రెడ్ ముక్కల అంచులు తీసేసి చిన్నచిన్న ముక్కలుగా చేయండి.
2 )తరువాత ఒక భానలిలో నెయ్యి వేసి కాచాక-బ్రెడ్ ముక్కల్ని వేయించి,పాలు పోసి సన్నని మంట మీద పెట్టి పాలు ఇంకి పోయేవరకు గరిట తో కలుపుతూ వుండాలి.
3 )తరువాత ఈ బ్రెడ్ మిశ్రమం మీద పంచదార,మామిడిపండ్ల రసం,ఒక కప్ నీళ్లు పోసి గరిటతో నెమ్మది కలపాలి.
4)పంచదార కరిగి బ్రెడ్ మిశ్రమంలో ఇంకి మరీ గుజ్జు గా కాకముందే దించేయండి.ఆ తరువాత జీడిపప్పు,పిస్తా పప్పు వేస్తె మాంగో కా మీటా రెడీ... దీని పైన చేర్రీస్ తో కూడా అలంకరిస్తే చాలా బావుంటుంది................

మాటర్ కోఫ్తా కర్రీ

కావలసినవి-
పచ్చి బఠానీ -పావు కేజి
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉల్లిపాయలు - 50 గ్రా
పచ్చి మిర్చి-నాలుగు
ఉప్పు-తగినంత
కారం-1 టీ స్పూన్
ధనియాల పొడి-1 టీ స్పూన్
గరం మసాలా- 1/4 టీ స్పూన్
పసుపు- 1/2 టీ స్పూన్
బంగాల దుంపలు-100 గ్రా
నూనె- 50 గ్రా
తయారుచేసే విధానం:
1)పచ్చి బఠానీలు ఉడికించి,మిక్సీలో గ్రైండ్ చేయండి.
2 )ఒక పాన్ లో నూనె వేసి కొన్ని ఉల్లిపాయముక్కల్ని వేయించండి.ఇందులో పచ్చిమిర్చి ముక్కలు,సెనగపిండి వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.ఆ పైన బఠానీ పేస్ట్ వేసి కలిపి ముద్దలుగా (కోఫ్తాలు) చేసి నూనెలో వేయించండి.
3 )ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించి,అందులో కారం,ధనియాల పొడి,పసుపు వేసాక-బంగాళా దుంప ముక్కలు కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించండి.గ్రేవి పూర్తిగా ఉడికాక,ఉప్పు వేయండి.ఇందులో ముందు గా వేయించి పెట్టుకున్న కోఫ్తాలు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు ఉడికిస్తే మాటర్ కోఫ్తా కర్రీ సిద్ధం......

Tuesday, January 27, 2009

బంజారా మటన్

కావాల్సినవి:
మటన్- 500 గ్రా
టమోటాలు- 150 గ్రా
ఉల్లిపాయలు-50 గ్రా
నూనె- 50 గ్రా
గరం మసాలా- 2గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లం-చిన్న ముక్క
ధనియాలు-2 టీ స్పూన్లు
ఎండుమిర్చి-మూడు
ఎండు మెంతి కూర-ఒక టీ స్పూన్
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 )మటన్ ని శుభ్రంగా కడిగి-గిన్నెలో వేసి కొంచెం ఉప్పు,గరం మసాలా కలిపి మెత్తగా ఉడికించాలి.
2)ఒక గిన్నె లో నూనె పోసి కాచాక -సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని ఎర్ర గా వేయించండి.తరువాత పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.తరువాత దంచిన ధనియాలు,ఎండుమిర్చి కలిపి ,ఉడికించిన మాంసాన్ని కూడా వేయండి.
3)ఈ మిశ్రమంలో టమోటా ముక్కల్ని వేసి సన్నని మంట మీద గ్రేవి పూర్తిగా ఉడికే వరకూ ఉంచి ఉప్పు సరి చూడండి.ఇప్పుడు దానిమీద ఎండు మెంతి కూర జల్లితే బంజారా మటన్ రెడీ.....

రిబ్బన్ పకోడీ

కావాల్సినవి:
సెనగపిండి- 400 గ్రా
బియ్యప్పిండి- 100 గ్రా
కొత్తిమీర- 4కట్టలు
పచ్చి మిర్చి-ఐదు
ఉప్పు-తగినంత
జీలకర్ర పొడి- 1టీ స్పూన్
కారం- 1టీ స్పూన్
నెయ్యి- 50గ్రా
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1)సెనగపిండి,బియ్యప్పిండి కలిపి జల్లించండి.ఇందులో ఉప్పు,సన్నగా తరిగిన కొత్తి మీర,పచ్చిమిర్చి,జీలకర్రపొడి,కారం కలపండి.
2 )తరువాత వేడి చేసిన నెయ్యిని పిండి లో పోసి కలియబెట్టండి.తరువాత ఇందులో నీళ్లు పోసి గట్టి ముద్దలా చేయండి.
3 )జంతికల గొట్టం లో రిబ్బన్ ఆకారంలో వచ్చే అచ్చును ఉంచి,ముందుగా కలిపిన పిండిని పెట్టి-వేడి నూనెలో వత్తి ఎర్రగా వేయించండి.నోరూరించే రిబ్బన్ పకోడీ రెడీ..........

Monday, January 26, 2009

కొబ్బరి కేక్

కావాల్సినవి:
మైదా- 30 గ్రా
కొబ్బరి-సగం చెక్క
పంచదార 20గ్రా
గుడ్లు-రెండు
పాలు-అర కప్పు
వెన్న- 20 గ్రా
చేర్రీస్-ఐదు
బేకింగ్ పౌడర్-పావు టీ స్పూన్

తయారు చేసే విధానం :
1 ) ఒక గిన్నెలో వెన్న ,పంచదారపొడి కలియబెట్టి మిశ్రమం లా తయారు చేయండి.ఇందులో పాలు,జల్లించిన మైదా,బేకింగ్ పౌడర్,బీట్ చేసిన గుడ్ల మిశ్రమాన్ని కలపండి.
2)ఆ పైన తురిమిన కొబ్బరి వేసి ,కలపండి.
3)కప్పులకు వెన్నగాని ,నెయ్యి గాని పూసి కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని పోయండి.దీని పైన చేర్రీస్ పెట్టండి.వీటిని ఓవెన్ లో నూటఎనభయి డిగ్రీల దగ్గర ఇరవై నిముషాలు కుక్ చేయండి.
4 )ఓవెన్ లేకపోతే కుక్కేర్ లో ఇసుక పోసి ,దాని పైన కప్పుల్ని ఉంచి-గాస్ కట్ లేకుండా మూత పెట్టి స్టవ్ మీద అరగంట సేపు కుక్ చేస్తే కొబ్బరి కేక్ రెడీ..........

గోబీ టకాటిన్

కావలసినవి:
కాలి ఫ్లవర్ -రెండు
జీలకర్ర పొడి-ఒకటిన్నర టీ స్పూన్లు
ధనియాలపొడి- 2టీ స్పూన్లు
టమోటాలు-పావు కేజీ
అల్లంవెల్లుల్లి- 2టీ స్పూన్లు
ఎండుమెంతికూరపొడి -ఒక టీ స్పూన్
కారం-ఒకటిన్న టీ స్పూన్లు
నెయ్యి- 50 గ్రా
ఉప్పు-తగినంత
కొత్తి మీర- 1కట్ట
తయారు చేసే విధానం:
1)కాలి ఫ్లవర్ ను ముక్కలు గా తుంచి నీటిలో వేసి ఉప్పు కలిపి మెత్త బడే వరకు ఉడికించండి.
2)స్టవ్ మీద పెనం ఉంచి -దాని అంచున ఉడికించిన కాలి ఫ్లవర్ ముక్కలు,టమోటా ముక్కలు అమర్చండి .
3)పెనం మద్య లో నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చేయండి.కొన్ని నిమిషాల తరువాత కాలి ఫ్లవర్ ముక్కల్ని మద్య లోకి తీసుకువచ్చి ఫ్రై చేయండి.తరువాత టమోటా ముక్కలు,ధనియాల పొడి,గరం మసాల,జీలకర్ర పొడి,ఉప్పు వేసి-అట్ల కాద తో చిన్న చిన్న ముక్కలు గా కొడుతూ బాగా దగ్గరగా చేయండి.
4)ఫ్రై చేసిన ముక్కలు దగ్గర అవ్వగానే ఎండు మెంతికూర పొడి,కొత్తి మీర జల్లితే గోబీ టకా టిన్ రెడీ...వేడి వేడి ఈ వంటకం స్నాక్ లా కూడా అతిధులకు అందించవచ్చు. గోబీ టకా టిన్ మీద ఉల్లిపాయ ముక్కలు,ఉడికించిన బఠానీ కూడా వేసి సర్వ్ చేయవచ్చు...............

చెట్టినాడు చికెన్

కావలసినవి:
చికెన్- 500 గ్రా
మిరియాలు-15 గ్రా
కొత్తి మీర -2 కట్టలు
గరం మసాలా- 5గ్రా
అల్లం వెల్లుల్లి- 4టీ స్పూన్లు
నూనె- 50మీ.లీ
నిమ్మకాయ-ఒకటి
ఉల్లిపాయలు- 100 గ్రా
టమోటాలు- 100 గ్రా
పెరుగు-ఒక కప్పు
ఉప్పు-తగినంత
కారం-2 టీ స్పూన్స్
కరివేపాకు-ఒక కట్ట
తయారు చేసే విధానం:
1 )చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.తరువాత అందులో దంచిన మిరియాలపొడి ,పెరుగు,కొంచెం అల్లంవెల్లుల్లిముద్ద,నిమ్మకాయరసం,తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా అంటేలా పట్టించి అరగంట సేపు నానబెట్టండి.
2 )తరువాత స్టవ్ మీద ఉంచిన గిన్నెలో నూనె పోసి కాచక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసాక ,మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్దను ,కారం.టమోటాముక్కలని వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
3)ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి,కలియబెట్టిన గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.చికెన్ ఉడక గానే గరంమసాలా పొడి,కొత్తి మీరా ,కరివేపాకు వేసి,దించి వేడివేడిగా రైస్ తో వడ్డించండి..........




Saturday, January 24, 2009

సాగో పకోడా

కావాల్సినవి:
సగ్గు బియ్యం-50 గ్రా
బియ్యప్పిండి- 100 గ్రా
పెరుగు -50 గ్రా
మైదా-50 గ్రా
కారం-అర టీ స్పూన్
ఉల్లిపాయలు-రెండు
పచ్చి మిర్చి-ఆరు
కరివేపాకు-ఒక కట్ట
ఉప్పు -తగినంత
కొత్తిమీర-ఒక కట్ట
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1)సగ్గు బియ్యాన్ని ఐదు గంటల సేపు పెరుగులో నానబెట్టాలి.
2 )ఇందులో బియ్యప్పిండి,మైదా,కారం,సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు,ఉప్పు,కరివేపాకు,కొత్తిమీర కలపండి. అవసరమనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా చేర్చవచ్చు.
3 )కాగిన నూనెలో ఈ ముద్దను పకోడిలా వేయండి.గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత తీస్తే వేడి వేడి సాగో పకోడా రెడీ............

Friday, January 23, 2009

పైనాపిల్ హల్వా

కావలసినవి:
అనాసపండ్లు -రెండు
నెయ్యి - 100 గ్రా
బొంబాయి రవ్వ-50 గ్రా
జీడి పప్పు- 20 గ్రా
లెమన్ ఎల్లోకలర్ -చిటికెడు
పంచదార - 250 గ్రా
తయారు చేసే విధానం :
1)అనాసపండ్లను చాకు తో చెక్కు తీసి ,ముక్కలుగా కోసి,మెత్త గా గ్రైండ్ చేయండి.
2 )తరువాత ఒక గిన్నెలో నెయ్యి పోసి వేడి చేసాక -గ్రైండ్ చేసిన పైనాపిల్ గుజ్జును వేసి కొంచెం ఫ్రై చేసి ,ఆ తరువాత పంచదార పోయండి.
3 )ఇప్పుడు పంచదార కరిగి పాకం అయ్యి దగ్గర అవుతుండగా ముందే నీటిలో నానబెట్టిన రవ్వను కలిపి పూర్తిగా ఉడికించండి.
4)దించే ముందు లెమన్ఎల్లో కలర్ ,జీడి పప్పు వేసి కలియబెట్టి వేడిగా ఆరగించండి.....

పనీర్ చిల్లి ఫ్రై

కావాల్సినవి:
పనీర్- 200 గ్రా
కార్న్ ఫ్లోర్ -50 గ్రా
మైదా - 30 గ్రా
అల్లం వెల్లుల్లి -5 గ్రా
మిరియాల పొడి-చిటికెడు
పచ్చి మిర్చి - 50 గ్రా
వెల్లుల్లి- 25 గ్రా
సోయా సాస్-10 గ్రా
చైనా సాల్ట్ -3 గ్రా
కొత్తి మీర్ - 2కట్టలు
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 )పనీర్ ను కొంచెం పెద్ద ముక్కలు గా కట్ చేసి వుంచండి.
2 )తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో కార్న్ ఫ్లోర్ ,మైదా పిండిలను కలిపి,ఆ మిశ్రమానికి అల్లం వెల్లుల్లి ముద్ద,మిరియాల పొడి ,తగినంత ఉప్పు,కొంచెం నీళ్లు కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి పనీర్ ముక్కల్ని ముంచి బాణలి లో కాగుతున్న నూనె లో బాగా ఫ్రై చేసి తీసుంచండి.
3 )తరువాత ఒక గిన్నెను స్టవ్ మీదుంచి,నూనె పోసి కాగాక ,ముందుగా సన్నని చిన్నగా తరిగిన వెల్లుల్లిముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేసాక,పచ్చి మిర్చి చీలికలను కూడా వేసి ఫ్రై చేయండి.
4 )ఇప్పుడు పనీర్ బజ్జీలను కలిపి కలియబెడుతూ ,దానిలో సోయా సాస్,చైనా సాల్ట్,సన్నగా తరిగిన కొత్తిమీర ,తగినంత ఉప్పు చేర్చి ఫ్రై చేయండి.
5)తరువాత ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను అర కప్పు నీళ్ళలో కలిపి పనీర్ చిల్లి ఫ్రై మీద పోస్తూ కలియబెడుతూ,పొడి గా అయ్యేంత వరకూ ఫ్రై చేసి దించి,ఫ్రైడ్ రైస్ తో గాని,పరోటా తో గాని సర్వ్ చేయాలి..............



అధ్రక్-కి -జింగా

కావాల్సినవి :
రొయ్యలు- 500 గ్రా
ఉల్లిపాయలు- 150 గ్రా
పచ్చి మిర్చి-ఆరు
అల్లం- 30 గ్రా
వెల్లుల్లి- 15 గ్రా
కారం- ఒకటిన్నర టీ స్పూన్
సోయా సాస్-2 టీ స్పూన్స్
అజినమోతో - 1 టీ స్పూన్
మిరియాల పొడి -పావు టీ స్పూన్
నూనె- 75 గ్రా
ఉప్పు-తగినంత
రెడ్ ఆరెంజ్ కలర్-చిటికెడు

తయారు చేసే విధానం:
1)ఒక్కో ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కోసి ,ఉప్పు కలిపిన నీటిలో పది నిమిషాల పాటు ఉడికించండి.పిదప నీళ్లు వార్చి ముక్కల్ని చల్లబర్చండి.
2 )ఈ ముక్కల్ని పచ్చిమిరపకాయలు కలిపి ముద్ద గా నూరండి.అలాగే అల్లం,వెల్లుల్లి ముక్కల్ని ముద్ద గా నూరండి.
3 )బాణలిలో నూనె పోసి వేడి చేసాక శుభ్రం చేసిన రొయ్యలు వేసి వేయించండి.వీటిని తీసేసిన పిమ్మట ఉల్లిపాయ ముద్ద వేసి ఎర్రగా ఫ్రై చేయండి.
4)ఇందులో అల్లం-వెల్లుల్లి ముద్ద ,కారం,మిరియాలపొడి ,రెడ్ ఆరెంజ్ కలర్ కలిపి ఐదు నిమిషాలు వేయించండి.ఆ పైన రొయ్యలు ,ఉప్పు వేసి కలియబెట్టండి.కూర కాస్త దగ్గర పడిన తరువాత అజినమోతో ,సోయాసాస్ లను చేర్చండి. ఐదు నిమిషాలు అయ్యాక అధ్రక్ కి జింగాను దించండి......

Thursday, January 22, 2009

మినీ స్ప్ర్రింగ్ రోల్స్



కావలసినవి :
మైదా - 250 గ్రా
గుడ్లు -ఒకటి
ఉప్పు-తగినంత
పాలు- 100 మీ.లీ
ఉల్లిపాయలు - 100 గ్రా
కాప్సికం - 100 గ్రా
సోయా సాస్ - టేబుల్ స్పూన్
చిల్లి సాస్ - టేబుల్ స్పూన్
అజినమోతో -చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా

తయారు చేసీ విధానం :
1 )మైదా పిండి లో కోడి గుడ్లు ,పాలు కలిపి జారుడు పిండిలా తయారు చేయండి .
2)ఒక పాన్ ను తీసుకుని వేడి చేయాలి. తరువాత బయటకుతీసి దాన్ని బయటకు తీసి ,గరిటెడు పిండి పోసి,చుట్టూ తిప్పి పలుచటి చిన్న పాన్ కేకు మాదిరిగా వేయండి.తరువాత మళ్ళీ పాన్ ను పొయ్యి మీద ఉంచండి. ఈ కేకును టేబుల్ మీద చపాతిలా పరచండి.
3)ఒక పాన్ లో కొంచెం నూనె పోసి,ముందుగా ఉల్లిపాయ,కాప్సికం ముక్కలు వేసి వేయించండి.అందులో కొంచెం సోయా సాస్,చిల్లి సాస్,అజినామోతో ,తగినంత ఉప్పు వేసి పొడి కూర తయారు చేయండి.ఆ పైన, ఈ పొడి కూరను పాన్ కేకుల మీద పెట్టి ,ఒక్కో కేకు ను ,కొంచెం మడత పెట్టి కప్పి,ముందు నుంచి చాపలా చుట్టి గుడ్డు సోనతో అతికించి ,వేడినూనె లో ఫ్రై చేయండి.మినీ స్ప్ర్రింగ్ రోల్ల్స్ రెడీ ... వీటిని టమోటా సాస్ తో సర్వ్ చేయాలి........








దేవి ప్రసాదం

కావలసినవి:
గోధుమ రవ్వ - 250 గ్రా
బెల్లం -350 గ్రా
నెయ్యి - 100 గ్రా
యాలకులు-5 గ్రా
జీడి పప్పు - 25 గ్రా
కిస్ మిస్ - 25 గ్రా
పచ్చి కోవా - 50 గ్రా
తయారు చేసే విధానం :
1)ముందు గా సన్నని గోధుమ రవ్వను ,జీడిపప్పు ,కిస్ మిస్ లను కలిపి ఒక గిన్నె లో వేయండి.ఆ తరువాత యాభయ్ గ్రాముల నెయ్యి ని చేర్చి గోధుమ నూక ను ఎర్రగా వేయించండి.
2 ) ఆ తరువాత ఆ నూక లో రెండున్నగ్లాసుల నీళ్లు పోసి బాగా కలియబెట్టి గిన్నె మీద మూత పెట్టి నూకను ఉడికించండి.
3 )గిన్నె లో నీళ్లు ఇంకిపోయిన తరువాత ముందు గానే తయారు చేసిన బెల్లం పాకాన్నివేసి ,సన్నని మంట మీద కలుపుతూ నూక ను ఉడికించండి.
4 )ఇప్పుడు బెల్లం పాకం,రవ్వలో బాగా ఇంకి ముద్ద గా తయారయ్యాక గ్ర పొడి,మిగిలిన నెయ్యి,ఎయ్యిచ్చి కోవాలు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాక దించి ,అతిధులకు అందించండి........

Wednesday, January 21, 2009

షాహీ మాటర్ పనీర్

కావలసినవి:
పనీర్ - 200 గ్రా
పచ్చి కోవా - 50 గ్రా
పచ్చి బఠానీలు -75 గ్రా
అల్లం-ఒక ముక్క
పచ్చి మిర్చి-ఐదూ
కోతి మీర -ఒక కట్ట
ఉల్లి పాయలు - 50గ్రా
జీడి పప్పు -20 గ్రా
గసగసాలు- 20 గ్రా
పెరుగు -అర కప్పు
కారం-అర టీస్పూన్
ఉప్పు-తగినంత
నూనె - 75 గ్రా
తయారు చేసీ విధానం
1)ఒక గిన్నెలో నూనె వేడి చేసి,ముక్కలు గా తరిగిన పనీర్ ను ఎర్రగా వేయించి తీసి ఉప్పు నీటి లో నానబెట్టండి.
2)అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాక,తురిమిన అల్లం,పచ్చి మిర్చిలను ,కారం,ముద్ద గా నూరిన జీడిపప్పు, గసగసాలమిశ్రమాన్ని కొంచెం ఫ్రై చేసి పెరుగును కలపండి.అవసరం ఐతే కొంచెం నీళ్లు పోసి గ్రేవి లా మరిగించండి.దీంట్లో పనీర్ ముక్కలు ,పచ్చి కోవా ,ఉడికించిన పచ్చి బటానీలు ,గరం మసాల వేసి ఉప్పు సరి చూసుకోండి. తయారైనా షాహీమాటర్ పనీర్ మీద కోతిమీర జల్లి వేడి వేడి పరోటాలతో వడ్డించండి ......

Tuesday, January 6, 2009

చికెన్ పెరిపెరి

కావాల్సినవి
చికెన్- 500గ్రా
మిరియాలు -అర టీస్పూన్
ఎండు మిర్చి - 20 గ్రా
అల్లం వెల్లుల్లి -ఒకటిన్నర టీ స్పూన్
జీలకర్ర -అర టీ స్పూన్
వెనిగర్ -అర కప్పు
దాల్చిన చెక్క- 2గ్రా
లవంగాలు -2 గ్రా
ఉప్పు- తగినంత
నూనె- 60గ్రా
తయారు చేసే విధానం
1 ) ఎండు మిర్చిని తుంచి అందులోని విత్తుల్ని తొలగించండి. ఈ ఎండు మిర్చి,మిరియాలు,జీలకర్ర ,లవంగాలు,దాల్చిన చెక్క- వెనిగర్ లో వేసి నానబెట్టండి.పిదప ఈ మిశ్రమాన్ని కాటుకలా మెత్తగా రుబ్బండి
2)చికెన్ ముక్కలకు అల్లంవెల్లుల్లి ,ఉప్పు,పట్టించి నానబెట్టండి.
3 )బాణలి లో నూనె పోసి వేడి చేయండి. ఇందులో మసాలాముద్ద ను వేసి వేయించండి. నూనె పైకి తేలుతున్నప్పుడు చికెన్ ముక్కలు వేసి కలియబెట్టండి.బాగా ఉడికే వరకు కలపండి.ఆ పైన పొడి పొడి గా అయ్యే వరకు చికెన్ ను వేయించండి.ఇప్పుడు చికెన్ పెరి పెరి తినడానికి రెడీ......

అరటికాయ వడలు

కావాల్సినవి
అరటికాయలు -రెండు
అల్లం-చిన్న ముక్క
పచ్చి మిర్చి -అరడజను
ఉల్లిపాయలు - 50 గ్రా
కొత్తిమీర -ఒక కట్ట
కరివేపాకు -అయిదు రెబ్బలు
ఉప్పు -తగినంత
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం

1)అరటికాయలను నీటిలోబాగా ఉడికించుకోవాలి.తరువాత తొక్క వలిచి ముద్ద గా చేసుకోవాలి.
2 )తరువాత ఆ ముద్ద లో సన్నగా తరిగిన అల్లం,పచ్చిమిర్చి ,ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలపండి.
3)ఇప్పుడు ఇలా చేసిన అరటికాయ ముద్ద ను చిన్న చిన్న ఉండలు గా చేసి,తడి చేతి తో వత్తి ,వడలు మాదిరిగా చేసి మరుగుతున్న నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేయాలి.
4)వీటిని సాస్ తో గాని ,పుదిన చెట్నీ తో గాని తింటే చాలా రుచి గా ఉంటాయి.

Sunday, January 4, 2009

చాక్లెట్ పుడ్డింగ్

కావసినవి
పాలు -అర లీటరు
కోకో పౌడర్ - 50 గ్రా
గుడ్లు -మూడు
పంచదార - 100 గ్రా
వెన్న - 60 గ్రా
మైదా - 3 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ - 3టేబుల్ స్పూన్స్
తయారు చేసీ విధానం
1) ఒక గిన్నె లో కోకో పౌడర్ ,కార్న్ ఫ్లౌర్ ,కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ సాస్ తయారు చేయండి.
2)తరువాత వేరే గిన్నె లో కోడిగుడ్ల మిశ్రమాన్ని పోసి ,అందులో పంచదార కలిపి బాగా కలియబెట్టండి.ఆ తరువాత ఆ గిన్నె లోనే పాలు కూడా పోయండి.
3)ఇప్పుడు అందులో పైన తయారు చేసి ఉంచిన చాక్లెట్ సాస్ ను పోసి మిశ్రమంలా చేయండి.తరువాత వెన్న పూసిన గిన్నె లో పాల మిశ్రమాన్ని పోసి గిన్నె మీద మూత పెట్టి స్టీంలో గాని,స్టీం పైన గాని పది నిమిషాల పాటు ఉడికించి తీసి,ముక్కలు గా కోస్తే చాక్లెట్ పుడ్డింగ్ తినడానికి రెడీ ..........

ములక్కాయ కొబ్బరి కూర

కావలసినవి
ములగాకాడలు -అయిదు
టమోటాలు - 150 గ్రా
కొబ్బరి-సగం చెక్క
ఉల్లిపాయలు- 50గ్రా
పచ్చిమిర్చి- అయిదు
పోపు సామగ్రి - 1/4 టీ స్పూన్
పసుపు - చిటికెడు
కరివేపాకు -ఒక కట్ట
ఉప్పు -తగినంత
నూనె -తగినంత
తయారు చేసీ విధానం
1)ఒక బాణలి లో నూనె వెసి కాచిన తరువాత పోపు వేసి ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి వేసి వేయించండి.
2 )తరువాత అందులో ములగకాడ ముక్కలు ,కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.
3 ) ముక్కలు వుడుకుతూ ఉంటే తగినంత ఉప్పు ,టమోటాలు,కరివేపాకు,కారం వేసి ఇగురు గా తయారు చేయండి .తరువాత కొబ్బరి తురుము వేసి కొంచెం సేపు ఉడికిస్తే ములక్కాయ కొబ్బరి కూర తయార్ .............

గోంగూర రొయ్యలు


















వెన్న మురుకులు












కావలసినవి

బియ్యప్పిండి - 3 కప్పులు

సెనగపిండి - 1/2కప్పు
వేయించిన సెనగపప్పు పొడి (పుట్నాల పౌడర్)- 1 టేబుల్ స్పూన్
వెన్న - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
వాము - 1/2 టీ స్పూన్
నూనె -వేయించడానికి సరిపడా












తయారుచేసే పద్దతి
1 )పైన చెప్పిన మూడురకాల పిండులను కలిపి జల్లించి పక్కన వుంచండి.
2 )పిండి లో ఉప్పు ,వెన్న ,వాము వేసి రెండు చేతులతో కలుపుతూ -నీళ్లు చేర్చి ముద్దలా చేయండి.
3 )మురుకులు(జంతికలు)గొట్టం తీసుకుని ,లోపల నూనె పూయండి. ఇప్పుడు పిండిముద్దను గొట్టం లో పెట్టి , కాగుతున్న వేడి నూనె లో మురుకులు గా తిప్పండి.వీటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వేయించిన మురుకుల్ని పేపర్ మీద పరిస్తే ఎక్కువైనా నూనె ను పీల్చుకుంటాయి.
4)ఇప్పుడు వేడి వేడి వెన్న మురుకులు తయారు..........

మిల్క్ మైసూర్ పాక్


కావలసినవి
పాలపొడి - 200 గ్రా
మైదా - 60 గ్రా
పంచదార - 1200 గ్రా
నెయ్యి - 500 గ్రా

తయారు చేసే విదానం 1
1)పాలపొడి, మైదాలలో యాబై గ్రాముల నెయ్యి ఫోసి మర్దించి విడిగా వుంచండి .
2)ఒక భానలిని స్టవ్ మీద పెట్టి పంచదార పోసి, అర లీటర్ నీళ్లు కలిపి పాకం పట్టండి. పాకం తీగ వస్తుండగా పాలపొడి, మైదా మిశ్రమాన్ని పోసి అట్లకాడతో కలియ పెడుతూఉండాలి.
౩)ఇప్పుడు వేడిచేసిన నెయ్యిని పంచదార పాకంలో నెమ్మదిగా పోస్తూ కలియ బెట్టండి మిశ్రమం దగ్గరగా, చిక్కగా అవుతున్నప్పుడు బానలిని దించి, ఆ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోసి అతిదులకు అందించండి.