కావాల్సినవి:
సగ్గు బియ్యం-50 గ్రా
బియ్యప్పిండి- 100 గ్రా
పెరుగు -50 గ్రా
మైదా-50 గ్రా
కారం-అర టీ స్పూన్
ఉల్లిపాయలు-రెండు
పచ్చి మిర్చి-ఆరు
కరివేపాకు-ఒక కట్ట
ఉప్పు -తగినంత
కొత్తిమీర-ఒక కట్ట
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:1)సగ్గు బియ్యాన్ని ఐదు గంటల సేపు పెరుగులో నానబెట్టాలి.
2 )ఇందులో బియ్యప్పిండి,మైదా,కారం,సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు,ఉప్పు,కరివేపాకు,కొత్తిమీర కలపండి. అవసరమనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా చేర్చవచ్చు.
3 )కాగిన నూనెలో ఈ ముద్దను పకోడిలా వేయండి.గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత తీస్తే వేడి వేడి సాగో పకోడా రెడీ............
No comments:
Post a Comment