కావలసినవి:
అనాసపండ్లు -రెండు
నెయ్యి - 100 గ్రా
బొంబాయి రవ్వ-50 గ్రా
జీడి పప్పు- 20 గ్రా
లెమన్ ఎల్లోకలర్ -చిటికెడు
పంచదార - 250 గ్రా
తయారు చేసే విధానం :1)అనాసపండ్లను చాకు తో చెక్కు తీసి ,ముక్కలుగా కోసి,మెత్త గా గ్రైండ్ చేయండి.
2 )తరువాత ఒక గిన్నెలో నెయ్యి పోసి వేడి చేసాక -గ్రైండ్ చేసిన పైనాపిల్ గుజ్జును వేసి కొంచెం ఫ్రై చేసి ,ఆ తరువాత పంచదార పోయండి.
3 )ఇప్పుడు పంచదార కరిగి పాకం అయ్యి దగ్గర అవుతుండగా ముందే నీటిలో నానబెట్టిన రవ్వను కలిపి పూర్తిగా ఉడికించండి.
4)దించే ముందు లెమన్ఎల్లో కలర్ ,జీడి పప్పు వేసి కలియబెట్టి వేడిగా ఆరగించండి.....
No comments:
Post a Comment